Share News

బై.. బై.. గణేశా..

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:36 PM

కాగజ్‌నగర్‌లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి. పట్టణంలో 150 విగ్రహాలను ఆయా వార్డుల్లో నెలకొల్పారు. శనివారం వివిధ పూజ కార్యక్రమాలను నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.

బై.. బై.. గణేశా..

- అంబరాన్నంటిన గణపయ్య నిమజ్జనం

- ఆకట్టుకున్న శోభాయాత్ర

- భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి. పట్టణంలో 150 విగ్రహాలను ఆయా వార్డుల్లో నెలకొల్పారు. శనివారం వివిధ పూజ కార్యక్రమాలను నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని గణనాథ విగ్రహాలను శోభయాత్రగా తరలించారు. పట్టణ వీధుల గుండా సాగి అనంతరం పెద్దవాగులో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దవాగులో అధికారులు క్రేన్‌ను ఏర్పాటు చేసి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ విగ్రహానికి పోలీసులు ముందస్తుగానే రూట్‌ మ్యాప్‌ ఇచ్చారు. ఈ రూట్‌ మ్యాప్‌ ద్వారా విగ్రహాలను తరలించారు. నిమజ్జనం సందర్భంగా వయోబేధం లేకుండా అంతా కలిసి నృత్యాలు చేస్తూ పెద్దవాగు నిమజ్జనం చేశారు.

వినాయ విగ్రహాల వద్ద ప్రముఖుల పూజలు

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణ ప్రముఖులు పూజలు చేశారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లారీ చౌరస్తాలో ఏర్పాటు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కోసిని మండపంలో పూజలు చేశారు. అనంతరం పెట్రోలు పంపులో గణనాథ మండలి వద్ద భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిచంచారు.

గణేష్‌ నిమజ్జనంలో పాల్గొన్న ఎస్పీ

ఆసిఫాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలోని పెద్దవాగు నదిలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పెద్దవాగు వద్ద నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:36 PM