Share News

జీవో నంబర్‌ 282 ప్రతుల దహనం

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:31 AM

రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను పెంచుతూ జారీ చేసిన జీవో నంబర్‌ 282 ప్రతుల ను ఆసిఫాబాద్‌ పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీ యూ, ఐఎన్‌టీయూసీ నాయకులు సోమవారం దహనం చేశారు.

జీవో నంబర్‌ 282 ప్రతుల దహనం
ఆసిఫాబాద్‌లో జీవో ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

ఆసిఫాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పని గంటలను పెంచుతూ జారీ చేసిన జీవో నంబర్‌ 282 ప్రతుల ను ఆసిఫాబాద్‌ పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీ యూ, ఐఎన్‌టీయూసీ నాయకులు సోమవారం దహనం చేశారు. ఈ జీవోతో కార్మికులకు పనిభారం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఉపేందర్‌, శ్రీకాంత్‌, లోకేష్‌, సుధాకర్‌, సురేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కెరమెరి: మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాయకులు రాజేందర్‌, ఆనంద్‌, రమేష్‌, రఘునాథ్‌, మల్లేష్‌, గౌతం రాజు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: జీవో నంబర్‌ 282 ప్రతులను సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌ చౌరస్తాలో దహనం చేశారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు త్రివేణి, నాయకులు చంద్రయ్య, మల్లేష్‌, రమేష్‌, అశోక్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, సత్యం, అరుణ, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌, ప్రధాన కార్యదర్శి అడివయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:31 AM