సన్నాలకు బోనస్‌ను వెంటనే చెల్లించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:20 PM
అర్హులైన రైతులకు వెంటనే రుణ మాఫీ చేయాలని, సన్నరకం ధాన్యానికి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరుతూ దండేపల్లిలో ఎల్లయ్యపల్లెలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో చేపట్టారు.

దండేపల్లిలో బీజేపీ నాయకుల రాస్తారోకో
దండేపల్లి, మార్చి 12: అర్హులైన రైతులకు వెంటనే రుణ మాఫీ చేయాలని, సన్నరకం ధాన్యానికి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరుతూ దండేపల్లిలో ఎల్లయ్యపల్లెలో రైతులతో కలిసి బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఉదయం నుంచే ముందస్తుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను దండేపల్లి ఎస్సై తైసినోద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు వారి ఇళ్లలోకి అరెస్ట్‌చేసి దండేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలిం చారు. కొందరు నాయకులు ఆందోళన చేయడానికి నాయకులు వస్తే, ఈ విషయం తెలుసుకున్న దండేపల్లి, జన్నారం ఎస్సైలు తైసినోద్దీన్, రాజవర్ధన్ తమ పోలీసు సిబ్బంది పార్టీ కార్యలయం వద్ద మోహరించారు. వారిని బయటికి రావాలని పోలీసులు పదే పదే చెప్పినప్పటికి వారు వినకుండా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయ కులు పత్తిపాక సంతోష్, గుండ రవీందర్, వనపర్తి రాకేష్, గడికోప్పుల సురేందర్ నిరసన దీక్ష చేశారు. కాగా మరికొందరు నాయకులు రైతులతో కలిసి పోలీసుల కళ్లుకప్పి రోడ్డుపై వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు అక్కడి చేరుకోని వారిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన నాయకులను సొంత పూచికత్తుపై సాయం త్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గాదెశ్రీనివాస్ మాట్లాడు తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా రైతులను మోసం చేస్తోందన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయకు బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.
- పోలీసుల మోహరింపు..
రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకులు తలపెట్టిన ఆందోళన, రాస్తారోకో జరగకుండా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో దండేపల్లి, జన్నారం ఎస్సైలు తైసోనోద్దీన్, రాజవర్ధన్ పోలీసు సిబ్బందితో తాళ్లపేట, మ్యాదరిపేట, దండేపల్లి, ముత్యంపేట ప్రధాన సెంటర్ల పోలీసు సిబ్బం ది మోహరించి వారు బందోబస్తుతో పర్యవేక్షించారు.