పోడు పట్టాలు అందించే వరకూ బీజేపీ పోరాటం
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:12 PM
ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూ ములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి
దండేపల్లి సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూ ములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. పోడు వ్యవసాయం కోసం ఆందోళన చేస్తున్న దండేపల్లి మండలంలోని లిం గాపూర్ అటవీ బీట్‌లో దమ్మనపేట, మామిడి గూడకు బుధవారం కాలినడక వెళ్లి వారి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘనాథ్ మాట్లాడుతూ దమ్మనపేట చెందిన గిరిజనులు పోడు భూమిలో నాలుగునెలల నుం చి నివాసం ఉంటు సాగు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆదివాసీలు సాగు చేసిన పంటలను ధ్వంసం చేయడంతో పాటు వారి పట్ల ఫారెస్ట్ సిబ్బంది అసభ్యకరమైన వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆయన మండిపడ్డారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి అర్హులైన గిరిజనులకు పోడు వ్యవసాయ భూములకు పట్టాలు అందించి వారికి న్యాయం చేయాలన్నారు. గిరిజనుల సమస్యలపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి పోడు పట్టాలు వచ్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకవెళ్లి న్యాయం చేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. అనంతరం వారి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రవిగౌడ్, నాయకులు రాజయ్య, ముకేష్‌గౌడ్, సంతోష్, అనిల్, లక్ష్మణ్, వెంకటేష్, మల్లేష్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.