Share News

రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని బీజేపీ నాయకుల నిరసన

ABN , Publish Date - May 25 , 2025 | 11:21 PM

వేమనపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి) : నీల్వాయి గ్రామంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరు తూ ఆదివారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షు డు ఏట మధుకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో డబుల్‌ రోడ్డు మంజూరైనా అధికా రులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణం పూర్తి కాలే దన్నారు.

రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని  బీజేపీ నాయకుల నిరసన

రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని

బీజేపీ నాయకుల నిరసన

వేమనపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి) : నీల్వాయి గ్రామంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరు తూ ఆదివారం బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షు డు ఏట మధుకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో డబుల్‌ రోడ్డు మంజూరైనా అధికా రులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల నిర్మాణం పూర్తి కాలే దన్నారు. గతంలో బీజేపీ పార్టీ చేపట్టిన నిరసన వల్ల గుత్తేదారు కొత్తగూడెం నుంచి నీల్వాయి వర కు రోడ్డు వేశారన్నారు. నీల్వాయి గ్రామంలో డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా సింగిల్‌ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, ఇందు కోసం రోడ్డును తవ్వి ఎర్రమట్టి పోయడంతో వర్షాలకు రోడ్డంతా బు రదమయంగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చే యాలని పేర్కొన్నారు. నాయకులు అజయ్‌కుమా ర్‌, చరణ్‌రాజ్‌, స్వామి, రమేష్‌గౌడ్‌, ప్రశాంత్‌, పోచయ్య, రవి పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:21 PM