గురుకులాల్లో మెరుగైన విద్యను అందించాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:45 PM
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో మెరుగైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య సూచించారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య
బెల్లంపల్లి, ఆగస్టు 18 (ఆంఽధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో మెరుగైన విద్యను అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బి వెంకటయ్య సూచించారు. సోమ వారం కార్మిక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల పాఠశా లను సందర్శించారు. పాఠశాలలోని విద్యార్థుల తో సమావేశ మై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నభోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌చైర్మన్ మాట్లాడుతూ బాలికలహాస్టల్ ప్రహరీ సోలార్ ఫెన్సింగ్ అమర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీగురుకుల విద్యా సంస్థలకు త్వరలోనే భవనాల నిర్మాణానికి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. గురుకుల పాఠశా లల్లో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు రాబ ట్టాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందిం చడంతో పాటు మెరుగైన విద్యను అందించాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ మనోజ్, ఎస్సీ, ఎస్టీ కమి షన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, నీలాదేవి, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గ ప్రసాద్, ఏసీపీ రవికుమార్, తహసీల్దార్ క్రిష్ణ పాల్గొన్నారు.
వినాయక మండపం ఏర్పాటుకు ఇబ్బందులు కలిగించొద్దు...
పట్టణంలోని బూడిదగడ్డ భక్తులు ఏర్పాటు చేసుకుం టున్న వినాయక మండపానికి అధికారులు ఎలాంటి ఇబ్బం దులు కలిగించవద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెంకటయ్య సూచించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చిన వినా యక మండపాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వస్థలంలో ఏర్పాటు చేసుకున్న వినాయక మండపాన్ని భవిష్యత్‌లో ప్రభుత్వానికి అవసరం నిమిత్తం ఉపయోగించు కోవచ్చునన్నారు. వినాయక మండపం కూల్చివేతపై బస్తీ లోని దళితులందరూ వినతిపత్రం అందజేయాలని తెలి పారు. అనంతరం పలు సమస్యలతో కూడిని వినతిపత్రాన్ని బస్తీ వాసులు అందజేశారు.