Share News

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:17 PM

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. మండంలోని లేండిగూడ, గౌరి కొలాంగూడ రాకపోకలు చేసే రోడ్డు మార్గంలో ఉన్న లో లేవల్‌ వంతెన, మండల కేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులను ఆదనపు కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో మాట్లాడుతున్న ఆదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

జైనూర్‌, జూన్‌, 4 (ఆంధ్రజ్యోతి: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. మండంలోని లేండిగూడ, గౌరి కొలాంగూడ రాకపోకలు చేసే రోడ్డు మార్గంలో ఉన్న లో లేవల్‌ వంతెన, మండల కేంద్రంలో నిర్మించిన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ పనులను ఆదనపు కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మండలంలో మంజూరైన అభివృధ్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఫాగింగ్‌ మిషన్‌ అందుబాటులో ఉంచుకోవాలని, రానున్న వర్షాకాలంలో పారిశుధ్య పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు క్లోరినేషన్‌ కార్యక్రమంపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసేలా కిందిస్థాయి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొదటి మార్కావుట్‌ ఈ నెల 9లోగా పూర్తిచేయాలని ఆయన కోరారు. ఆదేవిధంగా గ్రామాల్లో లబ్ధిదారుల కుటుంబ వివరాలు జన్‌మన్‌ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో గర్భిణుల వివరాలను సేకరించి వారికి వర్షాకా లంలో ఇబ్బంది కలగ కుండా తగిన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగం గా రైతులకు ఉపయో గకరమైన పనులు చేప ట్టాలని, భూగర్భ జల శాతాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించా రు. రానున్న రోజుల్లో హరితహారం కింద లక్షలాది మొక్క లు నాటేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్ర మంలో మండల ప్రత్యేక అధికారి జాధవ్‌ గున్వంత్‌రావ్‌, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో మోహన్‌, ఈవో కోరేంగా ఆనంద్‌రావ్‌, ఏపీవో నగేష్‌, ఈసీ అంకుష్‌, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:17 PM