Share News

వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:42 PM

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 15 (ఆంధ్ర జ్యోతి) : కీటక జనిత వ్యాధులైన మలేరియా, చికెన్‌ గున్యా,డెంగ్యూ పట్ల ప్రజలు అమ్రత్తంగా ఉండాలని, వైద్యాధికారులు వీటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం హ మాలీవాడలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలి
బస్తీ దవాఖానాను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 15 (ఆంధ్ర జ్యోతి) : కీటక జనిత వ్యాధులైన మలేరియా, చికెన్‌ గున్యా,డెంగ్యూ పట్ల ప్రజలు అమ్రత్తంగా ఉండాలని, వైద్యాధికారులు వీటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం హ మాలీవాడలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత దవాఖానా పరిధిలో ఉన్న ప్రజలకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించి రోగాలు ఉంటే చికిత్స అందించా లన్నారు. టీ హబ్‌ ద్వారా రిపోర్టులను వేగంగా తెప్పించుకుని మందులను పంపిణీ చేయాల న్నారు. ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్‌ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం అం దించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుం డా ప్రజలందరు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమలు పె రగకుండా నియంత్రించాలన్నారు. పిల్లలకు టీ కాలను సకాలంలో ఇప్పించాలని సూచించా రు. బస్తీ దవాఖానాలో ఆర్‌డీ కిట్ల ద్వారా పరీ క్షలు చేయాలని, ఎప్పటికప్పుడు వాటి వివరాలను అందించాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ అధికారి రమ్య, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:42 PM