Share News

డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆత్రం సుగుణ

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:26 PM

జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన ఆత్రం సుగుణ సోమవా రం బాధ్యతలు స్వీకరించారు.

డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఆత్రం సుగుణ
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను సన్మానిస్తున్న నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన ఆత్రం సుగుణ సోమవా రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. తరువాత ఇద్దరు జిల్లా పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సమీకరణ, రాబోయే కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ తనపై ఉంచిన విశ్వాసానికి పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు అనీల్‌గౌడ్‌, చరణ్‌, శ్యాం, ప్రశాంత్‌, దీపక్‌, రవీందర్‌, మహేష్‌గౌడ్‌, తిరుపతి, శ్రీనివాస్‌, తిరుపతి, బబ్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:26 PM