Share News

ఆసిఫాబాద్‌ పట్టణ బంద్‌ ప్రశాంతం

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:38 PM

జిల్లా కేంద్రంలో గత శుక్రవారం శారద, దుర్గదేవిల శోభాయాత్రలో పోలీసులతీరును నిరసిస్తూ హిం దూ సంఘాల సభ్యులు సోమవారం ఇచ్చిన పట్టణ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.

ఆసిఫాబాద్‌ పట్టణ బంద్‌ ప్రశాంతం
ఆసిఫాబాద్‌లో మూసి ఉన్న దుకాణాలు

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గత శుక్రవారం శారద, దుర్గదేవిల శోభాయాత్రలో పోలీసులతీరును నిరసిస్తూ హిం దూ సంఘాల సభ్యులు సోమవారం ఇచ్చిన పట్టణ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. బంద్‌తో దుకాణాలన్నీ మూసి ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శోభాయాత్రలో మహిళ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ప్రజలకు చేదోడువాదోడుగా ఉండాల్సిన పోలీసులే ఇబ్బందులకు కారణ మవుతున్నారని విమర్శించారు. పట్టణంలో ఇటీవల జరిగిన వినాయక, దుర్గా నవరా త్రులను సంప్రదాయ బద్ధంగా జరుపుకోని వ్వకపోవడం బాధాకరమన్నారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఎస్సై ఉదయ్‌ కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భక్తులపై అక్రమ కేసులు బనా యించడం శోఛనీయమన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థి తులు నెలకొనలేదని అందరు ఐక మత్యంతో పండుగలు సంప్రదా య బద్ధంగా జరుపుకుంటు వస్తు న్నారన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించ డం సరి కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరా వృతంకాకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భక్తులపై నమో దు చేసిన కేసులను ఎత్తివేసి, నిర్వాహకులకు సం బంధించిన డీజేలను ఇవ్వాలని కోరారు. సభ్యులు బాలేశ్వర్‌గౌడ్‌, గాదవేణి మల్లేష్‌, చిలూవేరి వెంకన్న, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 11:38 PM