కుమరం భీం వర్ధంతికి ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:36 PM
కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం నిర్వహించనున్న కుమరం భీం వర్ధంతి ఏర్పాట్లు పూర్తి అ య్యాయి.
కెరమెరి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం నిర్వహించనున్న కుమరం భీం వర్ధంతి ఏర్పాట్లు పూర్తి అ య్యాయి. ఏర్పాట్లను ఏఎస్పీ చిత్తరంజన్ పరిశీలించారు. వర్ధంతి సభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనులు తరలి రానున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఐటీడీఏ, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నా రు. వర్ధంతి సభకు పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు తెలిపారు.
శానిటేషన్ పనుల పరిశీలన..
శానిటేషన్ పనులను డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్ సోమవారం పరిశీలిం చారు. హట్టి బేస్ క్యాంపు నుంచి జోడేఘాట్ వరకు పనులు చేపడుతు న్నారు. వర్షాల కారణంగా రోడ్డు కోతకు గురికావడంతో ఆయా ప్రదేశాల్లో బారికేడ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అడిషనల్ డీఎం హెచ్‌వో మనోహర్, ఎంపీడీవో అంజద్ పాషా ఏర్పాట్లను పరిశీలించారు.
భీం వర్ధంతికి పటిష్ట బందోబస్తు
- ఏఎస్పీ చిత్తరంజన్
కెరమెరి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం వర్ధంతి సందర్భంగా కెరమెరి మండలం జోడేఘాట్ ప్రాంతంలో పటిష్ట భద్రత చర్యలు తీసుకు న్నామని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. సోమవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మంగళవారం జరగనున్న కార్యక్రమానికి మొత్తం 462 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించామని, ఇద్దరు డీఎస్పీలు, ఎని మిది మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 51 ఏఎస్సైలు, 136 మంది కానిస్టేబు ళ్లు, 56 మంది మహిళా కానిస్టేబుళ్లు, 79 మంది హోంగార్డులతో బందోబస్తు చేయనున్నట్టు తెలిపారు. ప్రముఖ ప్రదేశాలు, వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ, వసతి సదుపాయాల వద్ద ప్రత్యేక పహారా బృందాలు, ట్రాఫిక్ నియంత్రణ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీ వాహిదుద్దీన్, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు మధుకర్ పాల్గొన్నారు.