Share News

దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:57 PM

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను సూచించారు. నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.

దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను సూచించారు. నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ భవన సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి, లక్షెట్టిపేట, మందమర్రి, జైపూర్‌, హాజీపూర్‌, నస్పూర్‌, మంచిర్యాల, టేకుమట్ల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో 49 దరఖాస్తులు అందాయన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

ఒలింపిక్‌ రన్‌లో పాల్గొన్న కలెక్టర్‌

మంచిర్యాలక్రైం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఒలింపిక్‌ సంఘం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా డీవైఎస్‌వో హన్మం తురెడ్డి ఆద్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అసోసియేషన్‌ నిర్వహించిన 39వ ఎడిషన్‌ ఒలింపిక్‌ రన్‌ స్థానిక ఐబీ నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొ న్నారు. ఐబీలో ప్రారంభమై మంచిర్యాల పట్టణంలో పురవీధుల గుండా క్రీడా పతాకాలతో క్రీడాకారులు హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కోశాధికారి కనకర్తి రమేశ్‌జైన్‌, సెక్రెటరీ రాంచందర్‌, జిల్లా బ్యాడ్మింటన్‌ అధ్యక్షుడు ముకేశ్‌గౌడ్‌, ఏసీపీ ప్రకాశ్‌, డీటీడీవో జనార్ధన్‌, ఆర్డీవో కిషన్‌, డీఈవో అంజయ్య, రాజేశ్వరి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:58 PM