Share News

కలెక్టరేట్‌ ఎదుట ఏఎన్‌ఎంల ధర్నా

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:44 PM

ఎన్‌సీడీ ప్రొగ్రాంలో అన్‌లైన్‌ నుంచి ఏఎన్‌ఎంలకు విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేపట్టా రు.

కలెక్టరేట్‌ ఎదుట ఏఎన్‌ఎంల ధర్నా
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏఎన్‌ఎంలు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 8 (ఆంధ్ర జ్యోతి): ఎన్‌సీడీ ప్రొగ్రాంలో అన్‌లైన్‌ నుంచి ఏఎన్‌ఎంలకు విముక్తి కలిగించాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేపట్టా రు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ మాట్లాడు తూ దశాబ్ద కాలం నుంచి ఏఎన్‌ఎంలు ఎన్‌సీ డీ అన్‌లైన్‌ చేయడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారికి పనిభారం తగ్గించా లని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు అంద జేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఏఎన్‌ఎం యూనియన్‌ నాయకులు దివాకర్‌, చిరంజీవి, సంతోషి, పుణ్యవతి, సునీత, ప్రమీల, సత్యమ్మ తదితరు లు పాల్గొన్నారు.

- దివ్యాంగుల ఆధ్వర్యంలో..

దివ్యాంగులకు, వితంతువులకు, వృద్దులకు పెన్సన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో పెన్షన్‌దారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి థామస్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నాలుగు వేల పింఛన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే హైదరాబాద్‌ పట్టణంలో పెన్షన్‌దారులతో మహాగర్జన కార్యక్రమాన్ని చేపడతామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, వీ హెచ్‌పీఎస్‌ నాయకులు రేగుంట కేశవరావు, మల్లేష్‌, మూర్తి, శ్రీనివాస్‌, శ్రీశైలం, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:44 PM