Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:05 PM

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాయలంలో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే  చర్యలు
ఎస్‌హెచ్‌వోలకు ఫింగర్‌ ఫ్రింట్‌ డీవైస్‌లను అందజేస్తున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

- ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాయలంలో ఏర్పాటు చేసిన నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ కేసు క్వాలటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసు అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు రాబోయే గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో నియమనిబంధనలను వివరించాలన్నారు. శోభాయాత్ర సమయాల్లో డీజేలు పెట్టడం నిషేధమని, లక్కీడ్రా, లాటరీల నిర్వహణ రాష్ట్రంలో అనుమతి లేదని నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర సమయంలో పకడ్బందీగా ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాట్లను చేయాలని తెలిపారు. అనంతరం అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి మత్తు పదార్థాలు, మట్కా జూదం, లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతీ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ రామానుజం, డీసీఆర్‌బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఎస్‌హెచ్‌వోలకు ఫింగర్‌ ఫ్రింట్‌ డీవైస్‌ల అందజేత

జిల్లాలోని పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఫింగర్‌ ప్రింట్‌ డీవైస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌ల ద్వారా నేర విచారణలో నిందితుల గుర్తింపు త్వరగా సాధ్యమవుతుందని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను సులభంగా గుర్తించి చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. నూతన సాంకేతిక పద్ధతుల వినియోగం ద్వారా నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలు కాపాడటం పోలీసు శాఖ ప్రధాన ధ్యేయమరి తెలిపారు.

Updated Date - Aug 25 , 2025 | 11:05 PM