Share News

ఉత్పత్తి సాధన కోసం చర్యలు

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:24 PM

సింగరేణి బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యం ప్రారంభమైనప్పటికీ ఉపరితల గనులపై వర్ష ప్రభావం చూపుతూనే ఉంది.

ఉత్పత్తి సాధన కోసం చర్యలు

- వర్షాలు తగ్గుముఖం

- పనులు వేగవంతం చేస్తున్న అధికారులు

రెబ్బెన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యం ప్రారంభమైనప్పటికీ ఉపరితల గనులపై వర్ష ప్రభావం చూపుతూనే ఉంది. నెల వారి ఉత్పతి సాధన కోసం అధికారులు చేపడుతున్నప్పటికీ వాతావరణం అను కూలించక ఆటంకం ఏర్పడుతుంది. వారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్ట డంతో లక్ష్యాలను అధిగమించేందుకు అధి కారులు ప్రణాళికలు రూపొందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 72 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్ధేశించగా ఏడు నెలల్లో అక్టోబరు వరకు 22.64 మిలియన్ల బొగ్గు ఉత్పత్పి సాధించింది. మరో ఐదునెలల్లో లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అదే బెల్లంపల్లి ఏరియా వార్షిక లక్ష్యం 35 లక్షల టన్నులు కాగా, ఇప్పటికి 87 శాతం టన్నుల ఉత్పత్తి సాధించింది. ఏరియాలో ఒకే ఒక ఉపరితల గని ఖైరిగూడ ఉంది. కొత్త గోలేటి ఓసీపీకి ఇంకా మోక్షం కలుగక పోవటంతో ఏరియా మొత్తం ఖైరిగూడ ఓసీపీ పైనే ఆధార పడి ఉంది. రెండు నెలలుగా వరుసగా వర్షాలు కురియటం, మొంథా తుఫాన్‌ రావటంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్దేశించుకున్న 35 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో ఐదు నెలల్లో 18 లక్షల టన్నుల సాధించాల్సి ఉంటుంది. జూన్‌లో పుంజుకుని అత్యధికంగా ఉత్పత్తి సాధించింది. వర్షాల ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో యాభై శాతం ఉత్పత్తి సా ధించలేద. గత నెలలో ఏరియా 101 శాతంతో సంస్థ లోనే ముందంజలో నిలిచింది. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఏరియాలో నల వారిగా సాధించిన ఉత్పత్తి వివరాలు పరిశీలిస్తే.. ఏప్రిల్‌లో 3.50 లక్షల టన్నులకు 2.74 లక్షల టన్నులు సాధించి 78 శాతం నిలిచింది. మేలో 3.50 లక్షల టన్నులకు 3.04 లక్షల టన్నులు సాధించి 87 శాతం, జూన్‌లో 2.00 లక్షల టన్నులకు గాను 2.62 లక్ష ల టన్నులు 131 శాతం సాధించటం విశేషం. జూలైలో 2.00 లక్షల టన్నులకు గాను 2.00 లక్షల టన్నులు సా ధించి 100 శాతం, ఆగస్టు 2.00 లక్షల టన్నులకు గాను 1.50 లక్షల టన్నుల ఉత్పత్తి సాఽధించి 68 శాతం నిలిచిం ది. సెప్టెంబరు 2.00 లక్షల టన్నులకు గాను 0.74 37 శాతం, అక్టోబరులో 3.00 లక్షల టన్నులకు గాను 3.03 లక్షల టన్నులు సాధించి 101 శాతంతో నిలిచింది.

లక్ష్యాన్ని అధిగమిస్తాం..

-ఎం విజయభాస్కర్‌రెడ్డి, జీఎం, బెల్లంపల్లి ఏరియా

ఈ ఏడాది ఏకధాటిగా వర్షాలు కురిశాయి. ఏరియా కు 35 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంది. ఇప్పటికే 87 శాతం సాధించాం. వర్షాలు తగ్గటంతో బొగ్గు వెలికితీత పనులు వేగవంతం చేశాం. మార్చి 31 కల్లా లక్ష్యాన్ని అధిగమిస్తాము.

Updated Date - Nov 10 , 2025 | 11:24 PM