Share News

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:08 AM

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతు లు అవసరం మేరకు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు.

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, రైతు లు అవసరం మేరకు వినియోగించుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతంలోని మార్క్‌ ఫెడ్‌ జిల్లా కార్యాలయం, రాజీవ్‌నగర్‌లోని గోదాములను ఆకస్మికంగా సంద ర్శించి యూరియా నిల్వల వివరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో యూరియా ఉందని, అవసరం మేరకు తీసుకుని వినియోగించుకోవాలన్నారు. జిల్లావ్యవసాయ, సంబంధితశాఖల సమన్వ యంతో యూరియా పక్కదారి పట్టకుండా నిరంతరం పటిస్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలె క్టర్‌ కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై ఏర్పాటుచేసిన శిక్షణ కార్య క్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్ని కలు నిర్వ హించే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ఎన్నికల నిర్వహించే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణలో అధికారులకు అవసరమైన శిక్షణ అందిం చడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అనుమా నాలు, అపోహలు ఉన్నా శిక్షణ సమయంలో నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్ని కల నోటిఫికేషన్‌ అనంతంర రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుం దని తెలిపారు. డీపీవో వెంకటేశ్వర్‌రావు, ట్రైనింగ్‌ నోడల్‌అధికారి శంకర్‌ ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 12:08 AM