Share News

ముగిసిన మద్యం దుకాణాల ఎంపిక

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:17 PM

జిల్లాలో 2025-27కు సంబందించి మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.

ముగిసిన మద్యం దుకాణాల ఎంపిక
లక్కీ డ్రా ద్వారా దుకాణాలను తీస్తున్న కలెక్టర్‌ వేంకటేష్‌ ధోత్రే

- లక్కీ డ్రా ద్వారా కేటాయింపు

- ఏడు దుకాణాల డ్రా వాయిదా

ఆసిఫాబాద్‌ అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025-27కు సంబందించి మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్‌ వేంకటేష్‌ ధోత్రే, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా ఎక్సైజ్‌ అధికారి జ్యోతి కిరణ్‌లతో కలిసి లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలో మొత్తం 32 మద్యం దుకాణాలకు గాను 680 ధరఖాస్తులు వచ్చాయి.

వీటిలో షాపునంబర్‌ 9(రెబ్బెన), షాపునంబర్‌ 10(గోలేటి), షాపునంబర్‌ 14(కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్‌ ఏరియా), షాపునంబర్‌ 22(రవీంద్రనగర్‌), షాపునంబర్‌ 30 (జైనూర్‌-1), షాపునంబర్‌ 31(జైనూర్‌-2) షాపునంబర్‌ 32(సిర్పూర్‌(యూ), దుకాణాలకు దరఖాస్తులు తక్కువ రావడంతో ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఏడు దుకాణాలకు సంబందించిన డ్రాను వాయిదా వేశారు. మిగిలిన 25 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇందులో మొదటగా ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని మద్యం దుకాణాలకు తర్వాత కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ వేంకటేష్‌ ధోత్రే మాట్లాడుతూ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ లక్కీ డ్రా పద్ధతిన పూర్తి పారదర్శకంగా నిర్వహించామ ని తెలిపారు. అనంతరం జిల్లా ఎక్సైజ్‌ అధికారి జ్యోతి కిరణ్‌ మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఒప్పందం ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగింద న్నారు. ప్రభుత్వ విధానాలకనుగుణంగా నియమనిబంద నలకు లోబడి మద్యం దుకాణాలు నడుపవలసి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- లక్కీ విజేతలు వీరే..

జిల్లాలోని మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని ఆసిఫాబాద్‌ షాప్‌నంబర్‌- 1 వసంత్‌రావ్‌, షాప్‌నంబర్‌- 2 అశోక్‌, షాప్‌నంబర్‌- 3 వినోద్‌, షాప్‌నంబర్‌-4. జగన్‌, షాప్‌నంబర్‌- 5. సంతోష్‌ కూమార్‌, షాప్‌నంబర్‌- 6. రజీత, షాప్‌నంబర్‌- 7. సుదర్శనం, షాప్‌నంబర్‌-8.సంతోష్‌, షాప్‌నంబర్‌-11 ప్రహ్లద్‌, షాప్‌నంబర్‌-12 నరేష్‌, షాప్‌నంబర్‌-13 రవిందర్‌ గౌడ్‌ దుకాణాలను దక్కించుకున్నారు.

కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని కాగజ్‌నగర్‌ షాప్‌నంబర్‌-15 అశ్విని, షాప్‌నంబర్‌-16 లక్ష్మణ్‌కూమార్‌, షాప్‌నంబర్‌-17 శ్రీకాంత్‌రెడ్డి, షాప్‌నంబర్‌-18 దాసరి వైకుంఠం, షాప్‌నంబర్‌-19 రాచర్ల వైకుంఠం, షాప్‌నంబర్‌-20 విఠల్‌ , షాప్‌నంబర్‌-21 నిఖిత, షాప్‌నంబర్‌- 23 నగేష్‌, షాప్‌నంబర్‌-24 ఉపేంద్రచారి, షాప్‌నంబర్‌-25 సంపత్‌కూమార్‌, షాప్‌నంబర్‌-26 విఘ్నేష్‌, షాప్‌నంబర్‌-27 బావాజీ, షాప్‌నంబర్‌-28 మల్లికార్జున్‌గౌడ్‌, షాప్‌నంబర్‌-29ను మల్లేష్‌ దక్కించుకున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 11:17 PM