Share News

జవహర్‌ జాన్‌పహాడ్‌ ఎత్తిపోతలకు అదనంగా రూ.100కోట్లు

ABN , Publish Date - Jan 23 , 2025 | 12:57 AM

జవహర్‌ జాన్‌పహాడ్‌ ఎత్తిపోతల పథకానికి అదనంగా రూ.100కోట్లు, బెట్టెతండాలో ముసీ నదిపై చెక్‌డ్యాంకు రూ.7.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

జవహర్‌ జాన్‌పహాడ్‌ ఎత్తిపోతలకు అదనంగా రూ.100కోట్లు
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

బెట్టెతండాలో మూసీ నదిపై చెక్‌డ్యామ్‌కు రూ.7.5 కోట్లు

అధికారుల సమవేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పాలకవీడు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జవహర్‌ జాన్‌పహాడ్‌ ఎత్తిపోతల పథకానికి అదనంగా రూ.100కోట్లు, బెట్టెతండాలో ముసీ నదిపై చెక్‌డ్యాంకు రూ.7.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులపై మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అధికారులు, మండల మాజీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ173 కోట్లతో 5650 ఎకరాల పంట సాగు కోసం నిర్మించనున్న జావహార్‌ జాన్‌పహాడ్‌ లిఫ్ట్‌కు మరో రూ.100 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. దీంతో ఈ లిఫ్ట్‌ సామర్ధ్యం పెరగడంతోపాటు ఆయకట్టు మరో వేల ఎకరాలు పెరగనుందన్నారు. ఈ నీటితో జాన్‌పహాడ్‌ మునిమోపుల చెరువును నింపేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బెట్టెతండాలో ముసీ నదిపై చెక్‌డ్యాంకు రూ.7.5 కోట్లు మంజూరు చేశారు. జాన్‌పహాడ్‌ గ్రామం నుంచి జవహర్‌ జాన్‌పహాడ్‌ లిఫ్ట్‌ పంపుహౌస్‌ వరకు మెటల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు. ఈ పనులన్నీ వచ్చే పంటల సాగు వరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నిర్ణయాలపై మాజీ జడ్పీటీసీ మోతీలాల్‌, మాజీ ఎంపీపీ గోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సప్పిడి నాగిరెడ్డి, తీగల వెంకట్‌రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jan 23 , 2025 | 12:57 AM