Share News

AC Coaches: 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:00 AM

జోన్‌ పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ముఖ్యమైన 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది..

AC Coaches: 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు

  • 13 నుంచి అందుబాటులోకి..

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : జోన్‌ పరిధిలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న ముఖ్యమైన 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతీ రైలుకు ఒక త్రీటైర్‌ ఏసీ (ఎకానమీ) బోగీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/17234) రైళ్లు, సికింద్రాబాద్‌-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌(17201/17202), కాచిగూడ-విజయవాడ మధ్య నడిచే శాతవాహన(12713/12714), విజయవాడ- చెన్నై మధ్య నడిచే పినాకిని ఎక్స్‌ప్రెస్‌(12711/12712) రైళ్లకు అదనపు ఏసీ బోగీ సదుపాయం ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 07:00 AM