Share News

అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:30 PM

మంచిర్యాల పట్టణం లక్ష్మినగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా కిడ్జి ఎలిమెంటరీ పాఠశాల పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు సోమవారం జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి లలితకు వినతి పత్రం అందజేశా రు.

అనుమతి లేని పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
జిల్లా ఇంచార్జి విద్యాధికారికి వినతి పత్రం అందజేస్తున్న విద్యార్ధి జేఏసీ నాయకులు

మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల పట్టణం లక్ష్మినగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా కిడ్జి ఎలిమెంటరీ పాఠశాల పేరుతో అడ్మిషన్లు తీసుకుంటున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు సోమవారం జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి లలితకు వినతి పత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిల్డింగ్‌ పనులు పూర్తి కా కుండా, పాఠశాలకు అనుమతులు లేకుండా రంగు, హంగులతో ఫ్లె క్సీలను ఏర్పాటు చేసి విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ రాయి తీల పేరుతో మభ్యపెట్టి అడ్మిషన్లు పొందుతున్నారన్నారు. ఆ పాఠశా లపై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజే సిన వారిలో బచ్చలి ప్రవణ్‌, సల్మాన్‌ పాషా, జుమ్మిడి గోపాల్‌, జా గిరి రాజేష్‌, పూరేల్ల నితీష్‌, పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:30 PM