ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:59 PM
ఈ నెల 23న రాత్రి ఆవిడపు రాజయ్య అనే ఆటో డ్రైవర్‌ను హత్యచేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం జైపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో శ్రీరాంపూర్ ఇన్‌చార్జి సీఐ రవీందర్, ఎస్‌ఐ శ్రీధర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.

జైపూర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 23న రాత్రి ఆవిడపు రాజయ్య అనే ఆటో డ్రైవర్‌ను హత్యచేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం జైపూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో శ్రీరాంపూర్ ఇన్‌చార్జి సీఐ రవీందర్, ఎస్‌ఐ శ్రీధర్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జైపూర్ మండలంలోని ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రాజయ్యకు భార్య భాగ్య, కొడుకు సాయిసిద్ధార్థ, కూతురు యోగిత ఉన్నారు. రాజయ్య కొంత కాలం నుంచి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యతో నిత్యం గొడవ పడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజయ్య భార్యతో గొడవ పడి, కొడుకుపై కూడా దాడి చేయడంతో నస్పూర్‌లో ఉంటున్న తన అన్నయ్య ఇంటికి భాగ్య, తన కొడుకును తీసుకుని వెళ్లిపోయింది. తండ్రి ప్రవర్థనలో మార్పు రాకపోవడంతో తండ్రిని చంపాలని కొడుకు అనుకున్నాడు. ఈ నెల 23న రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇందారంలో ఉంటున్న తన తండ్రి వద్దకు వచ్చి కొడుకు గొడవ పడ్డాడు. స్నేహితులో కలిసి తండ్రి రాజయ్య గొంతు కోసి హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు సహకరించిన ఇద్దరు స్నేహితులు పరారీలో ఉండగా శనివారం తెల్లవా రుజామున ఐకే 1ఏ గని మూల మలుపు వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొ న్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, పారిపోవడానికి వాడిన మృతుడి ఆటో, మోటార్ సైకిల్, నిందితుల సెల్‌ఫోన్‌లు, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని బాలనేరస్తుల కర్మాగారానికి, జలంపల్లి సందీప్‌ను కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుళ్లు ఆర్. మల్లయ్య, ప్రసాద్, పోలీసులు సదానందం, బాబు, సత్యనారాయణ, మజీద్, మల్లికార్జునలను ఏసీపీ అభినందించారు.