Share News

ACB Raids: డీటీసీ ఇంట్లో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:51 AM

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శ్రీనివాస్‌ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేశాయి.

ACB Raids: డీటీసీ ఇంట్లో ఏసీబీ సోదాలు

వరంగల్‌ క్రైం, జగిత్యాల క్రైం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) డాక్టర్‌ పుప్పాల శ్రీనివా్‌సపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దృష్టి పెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై శ్రీనివాస్‌ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేశాయి. హనుమకొండ, దుర్గాకాలనీలో శ్రీనివాస్‌ నివాసముంటున్న అద్దె ఇంటితోపాటు, భీమారంలోని ఆర్‌టీఏ కార్యాలయం, హైదరాబాద్‌లోని సొంతిల్లు, స్వస్థలం జగిత్యాలతోపాటు కరీంనగర్‌లోని బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లోని విల్లాలతోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 02:51 AM