Share News

ఆధార్‌.. బేజార్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 10:53 PM

‘ఆధార్‌’్డ అనేది భారతీయులు అందరూ కలిగి ఉండాల్సిన గుర్తిం పు కార్డు. దీని నంబరే కీలకం. దేశ పౌరులని చెప్పుకోవడానికి ఇదే ప్రామాణికం. ఇప్పుడే పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు ఇది తోడుగా ఉండా ల్సిందే. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ ప్రత్యేక నంబరు ద్వారా పౌరుల వివరాలన్నీ ప్రభు త్వం వద్ద నిక్షిప్తమై ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈ నంబరు ప్రతి ఒక్కరికీ ఉపయగపడుతుంది.

ఆధార్‌.. బేజార్‌
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రంలోవేచిచూస్తున్న ప్రజలు

సరిగా పని చేయని సెంటర్లు

సమయం పాటించని నిర్వాహకులు

గంటల తరబడి నిరీక్షించినా అందని పౌర సేవలు

అధిక ధరలు వసూలు.. కనిపించని పట్టిక

భూపాలపల్లి కృష్ణకాలనీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ‘ఆధార్‌’్డ అనేది భారతీయులు అందరూ కలిగి ఉండాల్సిన గుర్తిం పు కార్డు. దీని నంబరే కీలకం. దేశ పౌరులని చెప్పుకోవడానికి ఇదే ప్రామాణికం. ఇప్పుడే పుట్టినప్పటి నుంచి కాటికి పోయేంత వరకు ఇది తోడుగా ఉండా ల్సిందే. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ ప్రత్యేక నంబరు ద్వారా పౌరుల వివరాలన్నీ ప్రభు త్వం వద్ద నిక్షిప్తమై ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈ నంబరు ప్రతి ఒక్కరికీ ఉపయగపడుతుంది. అయి తే.. ఆధార్‌కార్డును కొత్తగా తీసుకోవాలన్నా, అందు లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఇప్పుడు పెద్ద టాస్కే. భూపాలపల్లి జిల్లాలో ఆధార్‌ సెం టర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనాభాకు సరిపడా ఆధార్‌ కేంద్రాలు లేకపోవడం, ఉన్న కొద్ది సెంటర్లు కూడా సరిగా పనిచేయకపోవడం సమస్యగా మారింది.

భూపాలపల్లి జిల్లాలో ఆరు ప్రభుత్వామోదిత, ఐదు ప్రభుత్వేతర ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. మల్హర్‌, పలిమెల, టేకుమట్ల మండలాల్లో ఒక్క కేంద్రం కూడా లేకపోవడంతో ఆ మండలాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న కేంద్రాలకు వ్యయప్రయాసాలకోర్చి రావాల్సి వస్తోంది. ఇక్కడా వీరికి సకాలంలో సేవలు అందడం లేదు. సమయానికి సెంటర్లను తెరవకపోవడం, తెరిచినా సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సర్వ ర్‌ డౌన్‌, ఎర్రర్‌ అని సాకులు చెప్పడం పరిపాటిగా మారింది. సుదూర గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి పట్ల కొన్ని సెంటర్ల నిర్వాహకులు దురుసుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోం ది. అంతేకాదు.. కొందరు నిర్వాహకులు అనేక కొర్రీలు పెట్టి డబ్బులు కూడా దండుకుంటున్నట్టు సమాచారం.

ఏ సేవకు ఎంత రుసుమో?

ఆధార్‌ కేంద్రాల్లో ఏ సేవకు ఎంత రుసుమో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దేనికి ఎంత రుసుము ఉంటుందోననే చార్ట్‌ ప్రతి కేంద్రంలోనూ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. కానీ, అవేమీ కానరావ డం లేదు. అలాగే, తీసుకున్న రుసుముకు రశీదులు సైతం ఇవ్వడం లేదని తెలుస్తోంది. అత్యవసరంగా ఏదైనా కావాల్సిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలోని ఆధార్‌ కేంద్రాలివే..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ఆధ్వ ర్యంలో ఆరు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో భూపా లపల్లి మునిసిపాలిటీలో 1, భూపాలపల్లి తహసీల్‌ కార్యాలయంలో 1, మహదేవపూర్‌ తహసీల్‌ కార్యాల యంలో 1, కాటారం తహసీల్‌ కార్యాలయంలో 1, మొగు ళ్లపల్లి జీపీలో 1, చిట్యాల తహసీల్‌ కార్యాలయంలో 1 ఇలా.. మొత్తంగా ఆరు కేంద్రా లు నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆంరఽధబ్యాం కులో 1, తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు 1, సీఎస్‌సీ సెంటర్‌లో 1, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాల యంలో 1.. ఇలా మొత్తం ఐదు ప్రభుత్వేతర కేంద్రాలు ఉన్నాయి.

పని కాక.. సమాచారం తెలియక..

ఆధార్‌ కేంద్రాల్లో జనం అయోమయానికి గురికావాల్సి వస్తోంది. చిన్నారులకు కొత్తగా ఆధార్‌ కార్డు దరఖాస్తు చేసుకోవాలన్నా, కొత్తగా వివాహం చేసుకొని వచ్చినవారి చిరునామా మార్పుతో పాటు ఆధార్‌కార్డులో సవరణ చేసుకోవాలన్నా పెద్ద సమస్యగా మారింది. ఈ పనులు ఆయా సెంటర్లలో సాఫీగా జరగడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. వీటితో కొన్ని బ్యాంకు పరిధిల్లో నడుస్తున్న ఆధార్‌ కేంద్రాల ఆపరేటర్లు సమయ పాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వామోదంతో నడిచే కేంద్రాల్లో సైతం ఇష్టారాజ్యం నెలకొందని తెలుస్తోంది. ఆపరేటర్ల మాటతీరు సరిగా ఉండటం లేదని, తామొచ్చిన పనేమిటో, దానికి కోసం ఎలాంటి పత్రాలు అవసరమో చెప్పడానికి కూడా వారు ఇష్టపడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏదైనా అడిగితే కసురుకోవడం తప్ప సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు

ఆధార్‌ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు ఇక్కట్లు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ప ట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సరైన పర్యవేక్షించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధి కారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఆధార్‌సెంటర్లలో ఇష్టారాజ్యం సాగుతోందని విమర్శలు ఉన్నాయి. ఫలితం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..

- శ్రీకాంత్‌, ఈ-డిస్ర్టిక్‌ మేనేజర్‌, భూపాలపల్లి జిల్లా

ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఆధార్‌ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంది. జిల్లాలో ఆరు కేంద్రాలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. ఆయా కేంద్రాలన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉన్నాయి. ఇబ్బందులు ఎదు రువుతున్న విషయాలేమి మా దృష్టికి రాలేదు. నిబంధనల మేరకు ఆధార్‌ కేంద్రాలు కొనసాగేలా చర్యలు చేపడుతాం.

Updated Date - Mar 06 , 2025 | 10:53 PM