Share News

90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:10 AM

తొంభై ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో ఈ ఘటన జరిగింది.

90 ఏళ్ల వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

  • రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఘటన

యాచారం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): తొంభై ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు మంతన్‌గౌరెల్లికి చెందిన (90) వృద్ధురాలు బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తోంది.. ఇది గమనించిన దుండగులు తలుపులను తన్ని విరగొట్టి... ఇంట్లోకి చొరబడిన దుండగులు వృద్ధురాలి ఛాతీపై కొట్టి హింసించారు. ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు.


బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుల్లో ఒకడికి గడ్డం, మీసాలు ఉన్నాయని.. తెల్లటి టీషర్టు ధరించాడని బాధితురాలు చెప్పింది. గ్రామానికి క్లూస్‌టీం, పోలీసు జాగిలాలతో దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. సీసీ కెమెరాలు ఉండి ఉంటే దుండగులు పట్టుకోవడం తేలికయ్యేదని ఏసీపీ చెప్పారు.

Updated Date - Jun 13 , 2025 | 04:10 AM