Share News

NEET UG 2025: నీట్‌లో తెలంగాణ నుంచి 43,400 మంది అర్హత

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:30 AM

ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ (యూజీ)-2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం

NEET UG 2025: నీట్‌లో తెలంగాణ నుంచి 43,400 మంది అర్హత

ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ (యూజీ)-2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అత్యధికంగా 670 మార్కులతో జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు పొందిన కాకర్ల జీవన్‌ సాయి కుమార్‌ నుంచి 40 శాతం కట్‌ ఆఫ్‌తో 113 మార్కులు సాధించిన వారి జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ జాబితా నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాల కోసం మాత్రమేనని, మెరిట్‌ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది.

Updated Date - Jul 11 , 2025 | 04:30 AM