Share News

38 Summer Trains Start Today Between Key AP Routes: వేసవి రద్దీ నేపథ్యంలో 38 పత్యేక రైళ్లు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:41 AM

వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 38 వారాంత ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–శ్రీకాకుళం, తిరుపతి–మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి

38 Summer Trains Start Today Between Key AP Routes: వేసవి రద్దీ నేపథ్యంలో 38 పత్యేక రైళ్లు

  • నేటి నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం,తిరుపతి-మచిలీపట్నం మధ్య వారాంతంలో రాకపోకలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): వేసవిసెలవుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-శ్రీకాకుళం, తిరుపతి- మచిలీపట్నం మధ్య 38 వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నేటి నుంచి జూన్‌ 26 వరకు (శుక్ర) చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్‌ (07025) 12 రైళ్లు, ఈ నెల 12 నుంచి జూన్‌ 28 వరకు(శని) శ్రీకాకుళం రోడ్‌-చర్లపల్లి(07026)కి 12 రైళ్లు, ఈ నెల 13 నుంచి మే 25 వరకు(ఆది) తిరుపతి-మచిలీపట్నం(07121) మధ్య 7 రైళ్లు, ఈ నెల 14 నుంచి మే 26 వరకు (సోమ) మచిలీపట్నం-తిరుపతి (07122) మధ్య 7 రైళ్లు నడుస్తాయని వివరించారు.


  • 70 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

70 ప్రత్యేక రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించారు. ఈ నెల 13 నుంచి జూన్‌ 30 వరకు తిరుపతి-సాయినగర్‌-శిరిడీ (07637-38), ఈ నెల 12 నుంచి జూన్‌ 29 వరకు కాజీపేట-దాదర్‌ (07197-98), ఈ నెల 16 నుంచి జూన్‌ 27 వరకు జాల్నా-ఛాప్రా (07651-52) రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేశారు.

Updated Date - Apr 11 , 2025 | 05:41 AM