Share News

Telangana Government: 33 ఏళ్ల తర్వాత పదోన్నతులు ఇచ్చారు

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:30 AM

నీటిపారుదలశాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వడమే కాకుండా దక్షిణ, ఉత్తర తెలంగాణ

Telangana Government: 33 ఏళ్ల తర్వాత పదోన్నతులు ఇచ్చారు

  • ప్రభుత్వానికి హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం ధన్యవాదాలు

నీటిపారుదలశాఖలో 33 ఏళ్ల తర్వాత శాశ్వత ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వడమే కాకుండా దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల అధికారులకు పోస్టింగుల్లో సమన్యాయం చేశారంటూ హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఽసంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాపోలు రవీందర్‌, చక్రధర్‌ దన్యవాదాలు తెలిపారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పదోన్నతులు ఇచ్చారని, ఎక్స్‌టెన్షన్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా పదోన్నతులతో మేలు చేశారని చెప్పారు.

Updated Date - Aug 10 , 2025 | 04:30 AM