Share News

నడకలో రెండేళ్ల బుడతడి రికార్డు

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:37 AM

రెండేళ్ల పసిప్రాయంలో బుడిబుడి అడుగులతో ఓ బుడతడు ఏకంగా రికార్డు సృష్టించాడు. పటాన్‌చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ దంపతుల కుమారుడు రుద్రాన్ష్‌రెడ్డి..

నడకలో రెండేళ్ల బుడతడి రికార్డు

  • 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్లు నడిచిన రుద్రాన్ష్‌రెడ్డి

  • పటాన్‌చెరు బాలుడికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు

పటాన్‌చెరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పసిప్రాయంలో బుడిబుడి అడుగులతో ఓ బుడతడు ఏకంగా రికార్డు సృష్టించాడు. పటాన్‌చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ దంపతుల కుమారుడు రుద్రాన్ష్‌రెడ్డి.. 22 నెలల 24 రోజుల వయసులో 47 నిమిషాల వ్యవధిలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా, ఏకబిగిన 3.23 కిలోమీటర్లు నడిచి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు. చిన్నారి నడక వీడియోలను ఆన్‌లైన్‌ ద్వారా పోస్టు చేయడంతో రికార్డు నిర్వాహకులు రుద్రాన్ష్‌ ప్రతిభను గుర్తించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదు చేశారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్‌ను పంపారు.


సంగారెడ్డిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాత నరేందర్‌రెడ్డి తర్ఫీదుతోనే తమ చిన్నారి ఈ రికార్డు సాధించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. రుద్రాన్ష్‌ మరిన్ని రికార్డులు నమోదు చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, అలసిపోకుండా ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో గిన్నిస్‌ రికార్డు నమోదు చేయడమే లక్ష్యంగా రుద్రాన్ష్‌కు శిక్షణ ఇప్పిస్తామని తల్లిదండ్రులు ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - Mar 13 , 2025 | 05:37 AM