Jail Sentence: పోక్సో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:21 AM
అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి సిద్దిపేట జిల్లా ఫస్టుక్లాస్ అదనపు సెషన్సు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష..
దుబ్బాక, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి సిద్దిపేట జిల్లా ఫస్టుక్లాస్ అదనపు సెషన్సు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. అక్బర్‌పేట- భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన పర్స శ్రీనివాస్ (48) 2022 ఏప్రిల్ 16న రాత్రి బహిర్భుమికి వెళ్లిన ఓ 14 ఏళ్ల బాలికను నిర్బంధించాడు. అంతేగాక అరవకుండా చున్నీని నోట్లో కుక్కి, అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి తెలియజేయగా ఆమె అదే నెల 18న భూంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జయప్రసాద్ తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్సై హరికృష్ణను సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు.