Mancherial: శతాధిక వృద్ధుడి పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:21 AM
ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువు కల్తీమయంగా మారిన తరుణంలో వందేళ్లు బతకాలనుకోవడం అత్యాశే అవుతుంది.
దండేపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువు కల్తీమయంగా మారిన తరుణంలో వందేళ్లు బతకాలనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ మంచిర్యాల జిల్లాకు చెం దిన ఓ తాత మాత్రం 106వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రాగం గాలయ్య పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు గురువారం ఘనంగా నిర్వహించారు. గాలయ్యకు భార్య లింగవ్వ(97)తో పాటు ఒక కుమారుడు, 10 మంది కుమార్తెలు ఉన్నారు. వీరిలో నలుగురు కుమార్తెలు మృతి చెందారు. గాలయ్య కుటుంబ సభ్యులు మొత్తం 49 మంది ఒకే చోట చేరి జన్మదిన వేడుకలను నిర్వహించారు.