Transport Department: రవాణా శాఖలో కొత్తగా విధుల్లోకి 102 మంది ఏఎంవీఐలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:10 AM
రాష్ట్ర రవాణా శాఖలో కొత్తగా 102 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్..
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా శాఖలో కొత్తగా 102 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)లు విధుల్లో చేరుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీఐల పాసింగ్ ఔట్ పరేడ్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో బుధవారం జరుగుతుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా హాజరై ఏఎంవీఐల గౌరవ వందనం స్వీకరిస్తారు.