Share News

బాలికపై లైంగిక దాడి.. యువకుడికి పదేళ్ల జైలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:17 AM

వినాయక మండపం వద్దకు ప్రసాదం కోసం వచ్చిన రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది.

బాలికపై లైంగిక దాడి.. యువకుడికి పదేళ్ల జైలు

రామాయంపేట, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): వినాయక మండపం వద్దకు ప్రసాదం కోసం వచ్చిన రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు రూ.వెయ్యి జరిమానా కూడా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్‌ జడ్జి నీలిమ గురువారం తీర్పు వెలువరించారు. 2009 ఆగస్టు 27న రామాయంపేట వడ్డెర కాలనీకి చెందిన రొయ్యల రాజు.. ఆ బాలికను స్కూల్‌ అడ్రస్‌ అడిగి, ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు.


దీనిపై అప్పట్లో సీఐ విజయ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుత సీఐ వెంకటరాజాగౌడ్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి.. జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - Jun 13 , 2025 | 04:17 AM