Share News

‘నేల తల్లిని రక్షించుకునే బాధ్యత మన అందరిది’

ABN , Publish Date - May 17 , 2025 | 11:18 PM

నేల త ల్లిని రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంద ని శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌రెడ్డి అన్నారు.

‘నేల తల్లిని రక్షించుకునే బాధ్యత మన అందరిది’

గోపాల్‌పేట, మే 17 (ఆంధ్రజ్యోతి) : నేల త ల్లిని రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంద ని శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌రెడ్డి అన్నారు. శనివా రం మండలంలోని చెన్నూరులో ‘రైతు ముంగి ట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన శాస్త్ర వేత్త డా.రామ్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులు త క్కువ ధర విత్తనాలు కొనొద్దని, విత్తనాలు కొన్న ప్పుడు తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. రై తులు పొలాలను బట్టి సారాన్ని బట్టి పంటలు వేసుకోవాలని అన్నారు. పంట మార్పిడి పద్ధతి ని పాటిస్తే అధిక దిగుబడి ఇవ్వడానికి పొంద వచ్చని అన్నారు. ముఖ్యంగా చెట్లను సంరక్షిం చుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నా రు. రైతులకు ఇచ్చే సబ్సిడీలపై అవగాహన క ల్పించారు. రైతు అడిగిన సందేహాలకు సమాధా నం ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారి కర్మశ్రీ, మండల పరిషత్‌ వైద్య అ ధికారి డాక్టర్‌ ఆంజనేయులు, ఉద్యాన అధికారి శివతేజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:18 PM