Share News

విధులు సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:11 PM

పోలీసు అధికారులు, సిబ్బంది సక్ర మంగా విధులు నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉం టాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. గురువారం కోటపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ పరిసరాలను, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేశారు.

 విధులు సక్రమంగా నిర్వహించాలి
కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

డీసీపీ భాస్కర్‌

కోటపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : పోలీసు అధికారులు, సిబ్బంది సక్ర మంగా విధులు నిర్వహించాలని తద్వారా శాంతి భద్రతలు అదుపులో ఉం టాయని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. గురువారం కోటపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ పరిసరాలను, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్‌ రికార్డులను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు విష యంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులను ఎటు వంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చాలని పోలీసులకు సూచించారు. బ్లూకోర్ట్‌, పెట్రోకార్‌ సిబ్బంది డయల్‌100 కాల్స్‌కు తక్షణమే స్పందించి వెంటనే సం ఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోలింగ్‌ సమయంలో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని, స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించా లన్నారు. గ్రామాల్లో పోలీసు అధికారులు తరుచూ పర్యటిస్తూ ప్రజలతో మ మేకమవుతూ ప్రజలకు చట్టాల మీద, డయల్‌ 100, షీటీం, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎ లాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా విధులు నిర్వర్తించాలన్నారు. రూరల్‌ సీఐ బన్సీలాల్‌, ఎస్‌ఐ రాజేందర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 04:57 PM