Zimbabwe Versus Sri Lanka: లంకకు జింబాబ్వే షాక్
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:12 AM
ముక్కోణపు టీ20 టోర్నీలో శ్రీలంక జట్టుకు జింబాబ్వేకు షాకిచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో లంకను చిత్తు చేసింది. తొలుత జింబాబ్వే...
రావల్పిండి : ముక్కోణపు టీ20 టోర్నీలో శ్రీలంక జట్టుకు జింబాబ్వేకు షాకిచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో లంకను చిత్తు చేసింది. తొలుత జింబాబ్వే 20 ఓవర్లలో 162/8 స్కోరు చేసింది. బెన్నెట్ (49), కెప్టెన్ సికిందర్ రజా (47) సత్తా చాటారు. హసరంగ మూడు, ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షనక (34), రాజపక్ష (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇవాన్స్ మూడు, ఎన్ గవారా రెండు వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి