Yograj Singh: ఒంటరితనం భరించలేకున్నా
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:32 AM
కుటుంబ సభ్యులెవరూ తోడుగాలేని జీవితాన్ని భరించలేకపోతున్నానని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వాపోయాడు. ఒంటరి జీవితాన్ని తట్టుకోలేకపోతున్నానని...
చనిపోవాలనిపిస్తోంది!
యువీ తండ్రి యోగ్‌రాజ్ నిర్వేదం
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులెవరూ తోడుగాలేని జీవితాన్ని భరించలేకపోతున్నానని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వాపోయాడు. ఒంటరి జీవితాన్ని తట్టుకోలేకపోతున్నానని, చనిపోవాలనిపిస్తోందని 62 ఏళ్ల యోగ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో నిర్వేదం వ్యక్తంజేశాడు. ‘స్వస్థలంలో ఒక్కడినే ఉంటున్నా. ఎవరో ఒకరు వచ్చి అన్నం పెట్టి వెళ్తున్నారు. ఆహారం కోసం నే నెవర్నీ ఇబ్బంది పెట్టడంలేదు. నా తల్లిని, పిల్లలను, మనవళ్లను ఎంతో ప్రేమిస్తా. కానీ వారిని ఏదీ అడగను. నా జీవితం పూర్తయ్యింది. చావుకి సిద్ధంగా ఉన్నా. భగవంతుడు అనుకున్నప్పుడు నన్ను తీసుకుపోవచ్చు’ అని యోగ్‌రాజ్ అన్నాడు. యోగ్‌రాజ్ తొలుత షబ్నమ్ కౌర్‌ను వివాహమాడాడు. వారికి యువరాజ్, జొరావర్ పుట్టారు. షబ్నమ్‌తో విడాకుల అనంతరం నీనా బుంధేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె జన్మించారు. తానెంతగానో ప్రేమించేవ్యక్తులు తననెందుకు వీడారో అర్థం కావడంలేదని వాపోయాడు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి