Share News

వచ్చేనెల 14 నుంచి డబ్ల్యూపీఎల్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:18 AM

మూడో అంచె మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. వచ్చేనెల 14న లీగ్‌ మొదలవనుంది. బరోడా, బెంగళూరు, ముంబై, లఖ్‌నవూ స్టేడియాల్లో...

వచ్చేనెల 14 నుంచి డబ్ల్యూపీఎల్‌

న్యూఢిల్లీ: మూడో అంచె మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. వచ్చేనెల 14న లీగ్‌ మొదలవనుంది. బరోడా, బెంగళూరు, ముంబై, లఖ్‌నవూ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బరోడాలో జరిగే ఆరంభ పోరులో డిఫెండిండ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడనుంది. మార్చి 15న ఫైనల్‌ జరగనుంది. లీగ్‌లో చివరి 2 మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌ (మార్చి 13న), ఫైనల్‌ పోరుకు ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌, బెంగళూరుతో పాటు ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ టోర్నీలో పోటీపడుతున్న జట్లు.

Updated Date - Jan 17 , 2025 | 05:18 AM