Share News

Womens premier league: 27న ఢిల్లీలో డబ్ల్యూపీఎల్‌ వేలం

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:34 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) క్రికెటర్ల వేలాన్ని ఈనెల 27న ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ మేరకు లీగ్‌లోని అన్ని జట్లకు...

Womens premier league: 27న ఢిల్లీలో డబ్ల్యూపీఎల్‌ వేలం

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) క్రికెటర్ల వేలాన్ని ఈనెల 27న ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ మేరకు లీగ్‌లోని అన్ని జట్లకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది. ఈసారి వేలం పూర్తి స్థాయిలో జరగనుంది. ప్రతి జట్టు ఐదుగురు ప్లేయర్లను తిరిగి అట్టి పెట్టుకోవచ్చు. ఇందులో ముగ్గురు స్వదేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాలి. వేలానికి ప్రతి జట్టుకు రూ.15 కోట్ల పర్సు కేటాయించారు. అట్టిపెట్టుకునే క్రికెటర్లను ఐదు విభాగాలు (రూ.3.5 కోట్లు, రూ.2.5 కోట్లు, రూ.1.75 కోట్లు, రూ.1 కోటి, రూ.5 నుంచి 50 లక్షలు)గా విభజించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 05 , 2025 | 05:34 AM