World Chess Cup: గుకే్‌షకు షాక్
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:12 AM
ప్రపంచ కప్ చెస్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌కు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. జర్మన్ గ్రాండ్‌మాస్టర్ ఫ్రెడరిక్ స్వాన్ టాప్‌సీడ్ గుకేష్‌కు షాకిచ్చాడు....
మూడో రౌండ్‌లో నిష్క్రమణ
వరల్డ్ కప్ చెస్
పనాజి: ప్రపంచ కప్ చెస్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌కు మూడో రౌండ్‌లో చుక్కెదురైంది. జర్మన్ గ్రాండ్‌మాస్టర్ ఫ్రెడరిక్ స్వాన్ టాప్‌సీడ్ గుకేష్‌కు షాకిచ్చాడు. శనివారం జరిగిన రెండో క్లాసికల్ గేమ్‌లో తెల్లపావులతో బరిలో దిగినా గ్రాండ్‌మాస్టర్ గుకేష్ 55 ఎత్తుల్లో పరాజయం చవిచూడడం గమనార్హం. ఇద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ డ్రా అయిన సంగతి తెలిసిందే. రెండో గేమ్ నెగ్గిన స్వాన్ 1.5-0.5 స్కోరుతో గుకే్‌షని ఓడించి ముందంజ వేశాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, వి.ప్రణవ్ కూడా రౌండ్-32కి చేరారు. కార్తీక్ వెంకటరామన్-బోగ్డాన్ డానియల్ (రుమేనియా) మూడో రౌండ్ రెండో గేమ్‌కూడా డ్రా అయ్యింది. దాంతో ఇద్దరూ చెరో పాయింట్‌తో నిలవడంతో పోరు టైబ్రేక్‌కు మళ్లింది.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి