Share News

Sunrisers Passes Issue: సన్‌రైజర్స్‌ రాత మారేనా

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:20 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, సన్‌రైజర్స్‌ జట్టు మధ్య మ్యాచ్‌ టికెట్ల వివాదంపై విజిలెన్స్‌ దర్యాప్తు కొనసాగుతోంది. టికెట్ల పంపిణీ, కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివిధ అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు

Sunrisers Passes Issue: సన్‌రైజర్స్‌ రాత మారేనా

  • ఉప్పల్‌లో పంజాబ్‌తో అమీతుమీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డ ఉప్పల్‌ స్టేడియంలో మరో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. శనివారం శ్రేయాస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఆరంభంలో అద్భుతంగా ఆడి.. ఆపై వరుస పరాజయాలతో డీలా పడిన రైజర్స్‌ను గాడిన పెట్టాలని కెప్టెన్‌ కమిన్స్‌ పట్టుదలగా ఉన్నాడు. తమకు ప్రధాన బలమైన బ్యాటింగే ఇప్పుడు జట్టుకు బలహీనతగా మారింది. ఈ నేపథ్యంలో హెడ్‌, క్లాసెన్‌, ఇషాన్‌, నితీశ్‌లు బ్యాట్లు ఝళిపించాల్సి ఉంది. మరో వైపు పంజాబ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో నెగ్గింది. గత మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్‌ అయిన చెన్నై సూపర్‌కింగ్స్‌ను చిత్తుచేసి జోరు మీదున్నది. చెన్నైపై అద్భుత సెంచరీతో అదరగొట్టిన ప్రియాన్షు ఆర్య నుంచి మరోసారి ఆ ప్రదర్శనను పంజాబ్‌ ఆశిస్తోంది.

Updated Date - Apr 12 , 2025 | 04:22 AM