Asia Cup 2025: పాక్ ఫైనల్ చేరేనా
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:38 AM
ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ దశలో తొలిసారి గెలిచిన టీమిండియా.. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లోనూ పాక్‌ను..
దుబాయ్: ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ దశలో తొలిసారి గెలిచిన టీమిండియా.. ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లోనూ పాక్‌ను చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ ముచ్చటగా మూడోసారి అంటే.. ఫైనల్లో తలపడే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది. సూపర్-4 రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతుండడంతో పాక్ పని ఇప్పటికైతే ముగియలేదు. ఇంకా శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాక్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడినా.. పాక్ కథ ముగిసినట్టే. మరోవైపు పాక్‌పై గెలిచిన టీమిండియా.. ఇంకొక్క మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. బుధవారం బంగ్లాతో, శుక్రవారం లంకతో భారత్ ఆడాల్సి ఉంది.
చావోరేవో..: సూపర్-4లో భాగంగా మంగళవారం పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ ఇరుజట్లకూ చావోరేవోగా భావించాలి. బంగ్లాదేశ్ చేతిలో లంక ఓడగా.. భారత్ చేతిలో పాక్ చిత్తయింది. రెండు జట్లూ తొలి మ్యాచ్‌ల్లో ఓడడంతో.. రెండో మ్యాచ్‌లో తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ లంక చేతిలో పాక్ ఓడితే.. ఆ జట్టు ఫైనల్ ఆశలు గల్లంతైనట్టే. మరోవైపు లంక పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. ఇరుజట్లకూ ఇది కీలక మ్యాచ్ కావడంతో మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్