Share News

West Indies Test series 2025: నాయర్‌ నితీశ్‌లకు చాన్స్‌ దక్కేనా

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:46 AM

ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సకు ఎంపికైన కరుణ్‌ నాయర్‌కు మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. స్వదేశంలో వెస్టిండీ్‌సతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ...

West Indies Test series 2025: నాయర్‌ నితీశ్‌లకు చాన్స్‌ దక్కేనా

వెస్టిండీ్‌సతో టెస్ట్‌ సిరీ్‌సకు టీమిండియా ఎంపిక రేపు

న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీ్‌సకు ఎంపికైన కరుణ్‌ నాయర్‌కు మరో అవకాశం ఇస్తారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. స్వదేశంలో వెస్టిండీ్‌సతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ బుధవారం ఎంపిక చేయనుంది. ప్రస్తుతం సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ దుబాయ్‌లో ఉండడంతో.. వర్చువల్‌గా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారని సమాచారం. గాయం నుంచి కోలుకొన్న కరుణ్‌ నాయర్‌ సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. అయితే, ఇంగ్లండ్‌ టూర్‌లో కరుణ్‌ చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేక పోయాడు. దీంతో అతడి స్థానానికి తెలుగు ఆటగాడు నితీష్‌ కుమార్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొన్న నితీశ్‌.. ఆస్ట్రేలియా-ఎ టూర్‌కు ఎంపికయ్యాడు. యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌ స్థానాలు పదిలంగానే కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ టూర్‌లో గాయపడిన రిషభ్‌ పంత్‌ విషయంలో మెడికల్‌ టీమ్‌ నివేదిక అందాల్సి ఉంది. అయితే అతను ఫిట్‌గా లేడని, ధ్రువ్‌ జురెల్‌ను వికెట్‌ కీపర్‌గా తీసుకోవడం ఖాయమని అంటున్నారు. రెండో వికెట్‌ కీపర్‌, మూడో ఓపెనర్‌గా నారాయణ్‌ జగదీశన్‌కు చాన్సిస్తే.. అభిమన్యు ఈశ్వరన్‌కు చోటు కష్టమే. ఫిట్‌నెస్‌ ఇబ్బందులేమీ లేకపోతే జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌తోపాటు సిరాజ్‌కు చోటు ఖాయమే. తుదిజట్టులో నితీశ్‌కు చాన్సిస్తే.. ప్రసిద్ధ్‌ కృష్ణ లేదా అక్షర్‌ పటేల్‌లో ఒకరికి నిరాశ తప్పదు. శ్రేయాస్‌ అయ్యర్‌కు చోటు కష్టమేనంటున్నారు. వచ్చే నెల రెండు నుంచి అహ్మదాబాద్‌లో విండీ్‌సతో తొలి టెస్ట్‌ జరగనుంది.

ప్రాబబుల్స్‌ (15): శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), జైస్వాల్‌, రాహుల్‌, సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌/పడిక్కళ్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, సుందర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌, అక్షర్‌, నారాయణ్‌ జగదీశన్‌, నితీశ్‌ కుమార్‌, ఆకాష్‌ దీప్‌.

ఇవి కూడా చదవండి..

హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..

ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్

Updated Date - Sep 23 , 2025 | 05:46 AM