Share News

గుజరాత్‌ మళ్లీ మెరిసేనా?’

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:25 AM

మూడేళ్ల క్రితం ఐపీఎల్‌ అరంగేట్రంలోనే టైటిల్‌తో అదరగొట్టిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో నిలకడైన ప్రదర్శనతో ఆ తర్వాతి ఏడాది (2023) కూడా...

గుజరాత్‌ మళ్లీ మెరిసేనా?’

ఐపీఎల్‌ 3 రోజుల్లో

మూడేళ్ల క్రితం ఐపీఎల్‌ అరంగేట్రంలోనే టైటిల్‌తో అదరగొట్టిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో నిలకడైన ప్రదర్శనతో ఆ తర్వాతి ఏడాది (2023) కూడా రన్నరప్‌గా నిలిచింది. కానీ, మూలాధారమైన పాండ్యాను ముంబై ఇండియన్స్‌ తీసుకోవడం గుజరాత్‌కు పూడ్చలేని లోటుగా మారింది. అంతగా అనుభవంలేని శుభమన్‌ గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం కూడా ప్రదర్శనపై ప్రభావం చూపింది. దీంతో 2024 టోర్నీలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడు ఓడిన టైటాన్స్‌.. ఎనిమిదో స్థానంతో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ఖాన్‌, సాయి సుదర్శన్‌లతో కోర్‌ టీమ్‌ను రిటైన్‌ చేసుకొన్న మేనేజ్‌మెంట్‌.. అనుభవానికి కూడా పెద్దపీట వేసింది. మెగా వేలంలో బట్లర్‌, రబాడ, సిరాజ్‌ లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసి సమతుల్యమైన జట్టును తయారు చేసింది. కానీ, నిలకడలేని పవర్‌ హిట్టర్‌ షారుఖ్‌ ఖాన్‌ను రిటైన్‌ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గుజరాత్‌ ప్రధాన బలం బ్యాటింగ్‌. అయితే, గతే సీజన్‌లో పవర్‌ప్లే, మధ్య ఓవర్లలో ఆశించినంత రన్‌రేట్‌ రాబట్టలేక పోయింది. అయితే, ఈసారి బట్లర్‌ రాకతో దూకుడు పెరిగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు సాయి సుదర్శన్‌ కీలకంగా మారగా.. తెవాటియా, షారుఖ్‌ ఫినిషర్‌ పాత్ర పోషించనున్నారు. రబాడ, గెరాల్డ్‌ కొట్జీతోపాటు టీమిండియా పేసర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్‌ రషీద్‌తో బౌలింగ్‌ విభాగం మెరుగ్గానే కనిపిస్తోంది. అయితే, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడాన్ని జట్టు అలవాటు చేసుకోవాలి. కోచ్‌గా ఆశిష్‌ నెహ్రాను కొనసాగించడం కూడా ప్లస్‌గానే చెప్పుకోవాలి.


జట్టు

బ్యాటర్లు: శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), షెర్ఫెన్‌ రూథర్‌ఫోర్డ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌; వికెట్‌

కీపర్లు: జోష్‌ బట్లర్‌, కుమార్‌ కుశాగ్ర, అనూజ్‌ రావత్‌;

ఆల్‌రౌండర్లు: సాయి సుదర్శన్‌, రాహుల్‌ తెవాటియా, నిశాంత్‌ సింధు, మహిపాల్‌ లోమ్రోర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అర్షద్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, జయంత్‌ యాదవ్‌, కరీమ్‌ జనత్‌, షారుఖ్‌ ఖాన్‌;

బౌలర్లు: రబాడ, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కొట్జీ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌, ఇషాంత్‌ శర్మ, కుల్వంత్‌ కేజ్రోలియా, రషీద్‌ ఖాన్‌.

ఇవీ చదవండి:

ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్

యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్

ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 05:25 AM