టైటిల్ ఎవరిదో?
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:02 AM
చాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహక మ్యాచ్‌కు పాకిస్థాన్, న్యూజిలాండ్ సై అంటున్నాయి. శుక్రవారం జరిగే ముక్కోణపు సిరీస్ ఫైనల్లో రెండుజట్లూ అమీతుమీ తేల్చుకోనుంది....

సోనీ స్పోర్ట్స్‌లో మ.2.30 నుంచి..
ఫైనల్లో పాక్ గీకివీస్ నేడు
ముక్కోణపు సిరీస్
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి సన్నాహక మ్యాచ్‌కు పాకిస్థాన్, న్యూజిలాండ్ సై అంటున్నాయి. శుక్రవారం జరిగే ముక్కోణపు సిరీస్ ఫైనల్లో రెండుజట్లూ అమీతుమీ తేల్చుకోనుంది. యాదృచ్ఛికంగా ఈ నెల 19 నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనూ కివీ్‌సతోనే పాక్ తలపడాల్సి ఉంది. కాగా, ముక్కోణపు సిరీ్‌సలో పాక్, దక్షిణాఫ్రికాను ఓడించిన కివీస్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాక్ ఫుల్‌జోష్‌లో ఉంది. ఐసీసీ టోర్నీ ముందు రిజ్వాన్, సల్మాన్ ఆఘా, ఫఖర్ జమాన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ, డెత్ బౌలింగ్ కొంత ఆందోళనకరంగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఎంతో బలంగా ఉంది. విలియమ్సన్, ఫిలిప్స్, కాన్వే బ్యాట్‌తో అదరగొడుతున్నారు. ప్రత్యర్థితో పోల్చితే కివీస్ బౌలింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. ఇరుజట్లూ జోరుమీద ఉండడంతో ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..