Shreyas Iyer - Khaleel Ahmed: మ్యాచ్ అనంతరం అయ్యర్, ఖలీల్ అహ్మద్ మధ్య గొడవ.. వీడియో తీస్తుంటే
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:39 PM
ఈ నెల 8వ తేదీన ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఖలీల్ అహ్మద్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఐపీఎల్ (IPL 2025) రసవత్తరంగా సాగుతోంది. ఈ నెల 8వ తేదీన ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (PBKS vs CSK). ఈ మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed) మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ అనంతరం వారిద్దరూ మైదానంలోనే వాదించుకున్నారు. మ్యాచ్‌లో అయ్యర్‌ను ఖలీల్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో అయ్యర్‌కు దగ్గరగా వెళ్లిన ఖలీల్ కాస్తా ఉద్వేగంతో సంబరాలు చేసుకున్నాడు.
అయ్యర్ వైపు కోపంగా చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఘటన గురించి మ్యాచ్ అనంతరం ఖలీల్‌ను అయ్యర్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైనట్టు తెలుస్తోంది. ఇద్దరూ ఎదురెదురుగా నిల్చుని గట్టిగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఓ కెమేరామ్యాన్ వారి దగ్గరకు వెళ్లి షూట్ చేయడం ప్రారంభించాడు. ఆ కెమేరామ్యాన్‌ను ఆ ఇద్దరూ వారించారు. కాసేపు వాడివేడిగా మాట్లాడుకున్న వారిద్దరూ చివరకు కూల్ అయ్యారు. చివర్లో నవ్వుతూ మాట్లాడుకున్నారు.
ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ 18 పరుగుల తేడాతో ఓడించింది. ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో పాటు శశాంక్ సింగ్ (52) అర్ధశతకం సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసి 18 రన్స్ తేడాతో ఓడించింది. చెన్నై టీమ్ తాజా ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..