Share News

MS Dhoni: అందుకే అతడు ధోనీ.. కొత్త ప్లేయర్‌ను ఎలా గౌరవించాడో చూడండి..

ABN , Publish Date - May 08 , 2025 | 08:21 PM

విరాట్ కోహ్లీ నుంచి అంబటి రాయుడు వరకు ఎందరో క్రికెటర్లు ధోనీని ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. అంత మంది అభిమానాన్ని చూరగొన్న ధోనీ ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటుందో బుధవారం మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.

MS Dhoni: అందుకే అతడు ధోనీ.. కొత్త ప్లేయర్‌ను ఎలా గౌరవించాడో చూడండి..
MS Dhoni

ఎంఎస్ ధోనీ (MS Dhoni) అత్యుత్తమ నాయకుడు. స్ఫూర్తినిచ్చే ఆటగాడు. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారి మన్ననలు అందుకుంటున్న కెప్టెన్. విరాట్ కోహ్లీ నుంచి అంబటి రాయుడు వరకు ఎందరో క్రికెటర్లు ధోనీని ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. అంత మంది అభిమానాన్ని చూరగొన్న ధోనీ ప్రవర్తన ఎంత ఉన్నతంగా ఉంటుందో బుధవారం మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (IPL 2025).


ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే గెలుపొందింది. ధోనీ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. గెలిచిన అనంతరం డగౌట్‌కు వెళ్తూ కోల్‌కతా ఆటగాళ్లందరితోనూ కరచాలనం చేశాడు. అయితే ఒక ఆటగాడిని మర్చిపోయాడు. ఆ విషయాన్ని ధోనీ మధ్యలో గుర్తించాడు. ధోనీ మర్చిపోయిన ఆ ఆటగాడి పేరు షేక్ సకారియా. అతడో యువ బౌలర్. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ధోనీ ముందుకు వెళ్లిపోయాడు. మధ్యలో గుర్తుకురావడంతో వెనక్కి వచ్చి ఆ యువ బౌలర్‌తో చేయి కలిపాడు.


అతడి భుజం తట్టి నవ్వుతూ మాట్లాడాడు. దీంతో ఆ యువ క్రికెటర్ ఎంతో ఆనందపడ్డాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన అభిమానులు ధోనీ గొప్పతనం గురించి కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 08:21 PM