తెలుగుతెరపై వార్నర్ సందడి
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:25 AM
మైదానంలో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన కనబరచే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెండితెరపై సందడి చేయనున్నాడు...

హైదరాబాద్: మైదానంలో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన కనబరచే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెండితెరపై సందడి చేయనున్నాడు. అదీ ఓ తెలుగు సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రాబిన్‌హుడ్ సినిమాలో వార్నర్ అతిథి పాత్రలో మెరిశాడు. ఈ విషయాన్ని సినిమా నిర్మాత రవిశంకర్ వెల్లడించాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెలాఖరులో విడుదల కానుంది. ఇప్పటిదాకా సినిమాల్లో నటించకపోయినా వార్నర్‌కు టాలీవుడ్‌తో మంచి అనుబంధమే ఉంది. తెలుగు సినిమా హీరోల స్టయిల్స్‌ను అనుకరిస్తూ వార్నర్ చేసిన వీడియోలు ఇదివరకే సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..