Cricketers Personal Life : వీరూ జోడీ విడిపోనుందా?’
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:31 AM
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దంపతులు విడిపోనున్నారట. త్వరలో విడాకులు తీసుకోనున్నట్టు ఇరువురి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ దంపతులు ఇప్పటికే వేర్వేరుగా నివసిస్తున్నట్టు సమాచారం. 2004లో సెహ్వాగ్-ఆర్తికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దంపతులు విడిపోనున్నారట. త్వరలో విడాకులు తీసుకోనున్నట్టు ఇరువురి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ దంపతులు ఇప్పటికే వేర్వేరుగా నివసిస్తున్నట్టు సమాచారం. 2004లో సెహ్వాగ్-ఆర్తికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఉన్నారు. గత దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సెహ్వాగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో వీరూ, అతడి తల్లి, ఇద్దరు కుమారులే ఉండడంతో..సెహ్వాగ్ దంపతులు విడిపోనున్నారన్న వార్తలొచ్చాయి.. దానికితోడు వీరూ, ఆర్తి ఇన్‌స్టాలో పరస్పరం అన్‌ఫాలో చేసుకోవడం..ఆ వార్తలకు బలం చేకూర్చింది.