Share News

Kohli ODI century: సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..

ABN , Publish Date - Dec 03 , 2025 | 05:45 PM

పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తాజాగా మరో సెంచరీ చేశాడు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ చేశాడు. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో శతకం బాదాడు.

Kohli ODI century: సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..
Virat Kohli 53rd century

పరుగుల యంత్రం, రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ తాజాగా మరో సెంచరీ చేశాడు. రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ వరుసగా రెండో సెంచరీ చేశాడు. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో 135 పరుగులు చేసిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో శతకం బాదాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ. వన్డే ఫార్మాట్‌లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లీ ఎప్పుడో దాటేశాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు (Virat Kohli 53rd century).


వన్డేల్లో 53 సెంచరీలు చేసిన కోహ్లీ టెస్ట్‌ల్లో 30 శతకాలు మాత్రమే సాధించాడు. అంతర్జాతీయ టీ-20ల్లో ఒక సెంచరీ చేశాడు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 84 శతకాలు నమోదు చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. టెస్ట్‌ల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కలిగిన తొలి ఆటగాడిగా సచిన్ నిలిచాడు (Sachin Tendulkar world record).


సచిన్ తర్వాతి స్థానంలో కోహ్లీ 84 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు (Virat Kohli vs Sachin records). సచిన్ రికార్డును చేరుకోవాలంటే కోహ్లీ మరో 16 సెంచరీలు చేయాల్సి ఉంటుంది. కాగా, వన్డేల్లో కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు చేయడం ఇది 11వ సారి. ఇక, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ తిరిగి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకునేందుకు దగ్గరగా ఉన్నాడు. రోహిత్ శర్మ కంటే కేవలం 32 రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 03 , 2025 | 05:45 PM