Share News

Vigilance investigation: హెచ్‌సీఏ వివాదంపై కొనసాగుతున్న విజిలెన్స్‌ విచారణ

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:06 AM

హెచ్‌సీఏ మరియు సన్‌రైజర్స్‌ జట్టుకు మధ్య పాస్‌ల వివాదంపై విజిలెన్స్‌ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. టికెట్ల పంపిణీ, అమ్మకం, కాంప్లిమెంటరీ పాస్‌లు వంటి అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నారు

Vigilance investigation: హెచ్‌సీఏ వివాదంపై కొనసాగుతున్న విజిలెన్స్‌ విచారణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ మ్యాచ్‌ పాస్‌ల విషయంలో సన్‌రైజర్స్‌ జట్టు, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) మధ్య మొదలైన వివాదంపై విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సన్‌రైజర్స్‌ నుంచి వస్తున్న మ్యాచ్‌ టికెట్లు ఎన్ని? హెచ్‌సీఏ వాటిని ఏ విధంగా ఉపయోగిస్తోంది? కాంప్లిమెంటరీ పాస్‌లు ఎన్ని ఇస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్మారు? లాంటి విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు తీరును గురువారం విజిలెన్స్‌ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉప్పల్‌ స్టేడియానికి వచ్చి సమీక్షించారని సమాచారం.

Updated Date - Apr 12 , 2025 | 04:16 AM